'త్వరలోనే పవన్ ఆశయ బలం, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వం రాబోతుంది' - Nadendla Manohar news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 3:59 PM IST
Nadendla Manohar on Pawan Chandrababu Govt: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల ప్రభుత్వం రాబోతుందని.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ రాష్ట్రానికి దోపిడీ, దౌర్జన్యాలు లేని పాలకుల అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని మనోహర్ వ్యాఖ్యానించారు.
Manohar Comments: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నాదెండ్ల మనోహర్ బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..''జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ నాయకులు పొట్టి శ్రీరాములు స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రానికి దోపిడీ, దౌర్జన్యాలు లేని పాలకుల అవసరం చాలా ఉంది. త్వరలోనే పవన్ ఆశయ బలం, చంద్రబాబు అనుభవంతో కూడిన ప్రభుత్వం రాబోతుంది'' అని ఆయన అన్నారు.