ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాజీ మంత్రి బాలినేని

ETV Bharat / videos

Balineni : ఆరోపణలు నిరూపిస్తే.. ఆస్తులు రాసిస్తా : మాజీ మంత్రి బాలినేని - balineni on it raids

By

Published : Apr 23, 2023, 5:21 PM IST

Balineni : మైత్రి మూవీస్​లో తనకు గానీ తన వియ్యంకుడికి గానీ పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే ఇద్దరి ఆస్తులు రాసిస్తామని, రాజకీయంగానూ తప్పుకుంటానని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ఒంగోలులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ... విశాఖపట్నం మైత్రి మూవీస్​లో తనకు పెట్టుబడులు ఉన్నాయని జనసేన కార్పొరేటర్ ఆరోపించారని... ఈ ఆరోపణలను నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని ఆయన అన్నారు. మైత్రి మూవీస్​లో కొద్ది రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా ఐటీ శాఖను తన మీదకు ఉసిగొలిపే విధంగా ఆరోపణలు చేస్తున్నారని మండపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా సినిమా వాళ్లే కాబట్టి.. సినిమా సంబంధాలు ఉన్నందున  ఆయన విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మైత్రి మూవీస్​లో తన పెట్టుబడులు ఉన్నాయని నిరూపిస్తే ఆస్తులు రాసిస్తానని పేర్కొన్నారు. నిజం కాకపోతే మీ కార్పొరేటర్​పై చర్య తీసుకోండి అన్నారు. తన వియ్యంకుడు భాస్కర్ రెడ్డి విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని... ఆయన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణ చేయడంతో పాటు.. తాజాాగా నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఆరోపణ వెనుక ఎవరున్నారో తనకు తెలిసునని, వాళ్లు చేసిన ఘనకార్యాలు కూడా తెలుసు అంటూ మాజీ మంత్రి బాలినేని విమర్శించారు. 

ABOUT THE AUTHOR

...view details