ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ

ETV Bharat / videos

Ministers Meeting With Electricity Employees: విద్యుత్‌ ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ.. ఆ కారణంగానే..!

By

Published : Jun 22, 2023, 9:36 AM IST

Ministers Meeting With Electricity Employees: వేతన సవరణతో పాటు వివిధ డిమాండ్లపై.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నోటీసు ఇవ్వటంతో మంత్రులు ఆయా సంఘాల నేతలతో హడావిడిగా చర్చలు జరిపారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి, కారుమూరు నాగేశ్వరరావులు విద్యుత్ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వేతన సవరణపై చర్చించారు. వన్ మాన్ కమిషన్ నివేదికపై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రులు.. ప్రస్తుతం ఈ వన్ మాన్ కమిషన్ నివేదికను పక్కనపెట్టామని స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఉద్యోగులకు అలవెన్సులు యథాతథంగా కొనసాగించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. వెయిటేజితో పాటు ఫిట్మెంట్లనూ కొనసాగించాలని విద్యుత్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఇరువురు మంత్రులు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో మరోమారు భేటీ అవుదామని స్పష్టం చేశారు. వాస్తవానికి వేతన సవరణతో పాటు వివిధ డిమాండ్లపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నోటీసు ఇవ్వటంతో హడావిడిగా మంత్రులు ఆయా సంఘాల నేతలతో సమావేశమై చర్చలు జరిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details