ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం

ETV Bharat / videos

Maha Kumbhabhishekam in Srisailam: శ్రీశైలంలో మహా కుంభాభిషేకం ఈ నెల 25 నుంచి ప్రారంభం

By

Published : May 16, 2023, 9:42 AM IST

Maha Kumbhabhishekam in Srisailam : శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి 31 వరకు మహా కుంభాభిషేకం వైభవంగా జరగనుంది. మహా కుంభాభిషేకం ఏర్పాట్లను దేవస్థానం ఈఓ ఎస్. లవన్న, ఇంజనీర్లు శరవేగంగా చేపడుతున్నారు. ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక యాగశాల, హోమగుండాలను నిర్మించే ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. మహా కుంభాభిషేకానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరు కానుండడంతో శివాజీ గోపురానికి తాత్కాలిక లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలంలో నూతనంగా 220 గదులతో నిర్మించిన గణేష్ సదన్ వసతి సముదాయాన్ని ఈ నెల 30 వ తేదీన ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించనున్నారు. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో 75 కోట్ల రూపాయలతో అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మించడానికి జగన్ భూమి పూజ చేయనున్నారు. 

2012లో వర్షాలకు కూలిపోయిన శివాజీ గోపురాన్ని పునర్నిర్మించారు. కొత్తగా నిర్మించిన శివాజీ గోపురానికి స్వర్ణ తాపడ కలశాలను పునఃప్రతిష్టించనున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణంలో కూడా జీర్ణోద్దరణ చేసిన మూడు శివాలయాల్లో శివలింగాలను పునఃప్రతిష్టించనున్నారు. మహా కుంభాభిషేకానికి విశాఖ శారదా పీఠాధిపతి, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి, శృంగేరి, కంచి పీఠాధిపతులు హాజరుకానున్నారు. 

ABOUT THE AUTHOR

...view details