ఆంధ్రప్రదేశ్

andhra pradesh

venkataramana_visited_indrakiladri

ETV Bharat / videos

ఇంద్రకీలాద్రీ అమ్మవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర న్యాయమూర్తి జస్టిస్ వెంకటరమణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2023, 11:52 AM IST

Justice D.Venkataramana Visited Indrakiladri : మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వెంకటరమణ ఇంద్రకీలాద్రిపైన ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన జస్టిస్ వెంకటరమణకు.. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత పండితుల వేద ఆశ్వీర్వచనం అందించారు. అనంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాన్ని ఆలయ అధికారులు జస్టిస్ వెంకటరమణకు అందజేశారు. 

Historical Background : బెజవాడ కనకదుర్గమ్మగా పేరుగాంచిన అమ్మవారు.. శ్రీ చక్ర అధిష్టాన దేవతగా వెలసింది. ఆంజనేయస్వామి దుర్గ గుడి క్షేత్ర పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు. అందుకే అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా హనుమంతుని దర్శించుకుంటారు. ఆ తర్వాతనే అమ్మవారి దర్శనం చేసుకుంటారు. దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన తరువాత ఇంద్రకీలాద్రిపై అమ్మవారు వెలసిందని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారికి దసరా శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. శరన్నరాత్రుల్లో అమ్మవారు.. రోజుకు ఒక్కొక్క అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.

కార్తికమాసంలో ప్రతి సోమవారంతోపాటు విశేషమైన రోజుల్లో బిల్వార్చన జరుగుతుందని ఆలయ అధికారులు చెప్పారు. ఈనెల 16న కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం జరుపుతామని.. 27వ తేదీ కార్తిక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఉంటుందన్నారు. ఈనెల 23 నుంచి 27 వరకు భవానీ మండల దీక్ష మాలధారణలు, డిసెంబరు 13 నుంచి 17 వరకు భవానీ అర్ధమండల దీక్ష మాలధారణలు జరుగుతాయన్నారు.జనవరి మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు భవానీదీక్షల విరమణ, శతచండీయాగానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. డిసెంబరు 26న కలశజ్యోతి మహోత్సవం నిర్వహిస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details