పంట నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం - మహిళా రైతు ఆవేదన - రైతుల కష్టాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 13, 2023, 12:41 PM IST
|Updated : Dec 13, 2023, 2:54 PM IST
Lady Farmer Problems In Anantapur District 2023 : అనంతపురం జిల్లా గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామంలో కేంద్ర కరవు బృందం సభ్యులు, మహిళా రైతుకి చెందిన కంది, ఆముదం పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సమయం లేకపోవడంతో పూర్తి స్థాయిలో రైతులతో చర్చించలేకపోయామని, రాజకీయ నాయకులు, అధికారులతో పంట నష్టం, మండలంలో ఏర్పడిన తీవ్ర కరవుపై ఆరాతీశామన్నారు.
Farmers Problems Due To Michaung Effect In Andra pradesh :ఎకరానికి 25వేల రుపాయలు పెట్టుబడి పెట్టి కందిని సాగు చేశానని వర్షాభావం లేకపోవడం, కరవు కారణంగా మెుక్క ఎదుగుదల లేకుండా పోయిందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. మందులు పిచికారి చేసినప్పటికీ ఫలితం లేదని పంట మెుత్తం ఎండిపోయిందని చివరకు తనకు అప్పులే మిగిలాయని ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సహాయం అందలేదని ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీటిపర్యంతమైంది.