ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jyothi_Surekha_and_Hampi_reached_Gannavaram

ETV Bharat / videos

Jyothi Surekha and Hampi Reached Gannavaram : 'ఆసియా' విజేతలు.. జ్యోతిసురేఖ, కోనేరు హంపికి గన్నవరంలో ఘనస్వాగతం - విజయవాడ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2023, 1:26 PM IST

Jyothi Surekha and Hampi reached Gannavaram: ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు సాధించిన జ్యోతి సురేఖ, కోనేరు హంపితో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించటం గర్వంగా ఉందని జ్యోతి సురేఖ, హంపి తెలిపారు. చైనాలోని హాంగ్​జౌలో జరిగిన 19వ ఆసియా క్రీడలు (19th Asain games) ఆర్చరీలో మొదటిసారిగా బంగారు పతకం సాధించటం గర్వంగా ఉందని వెన్నం జ్యోతి సురేఖ అన్నారు. ఒకేసారి మూడు పతకాలు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. 

చెస్​ పోటీల్లో రజతం సాధించటం ఆనందంగా ఉందని కోనేరు హంపి పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో చెస్​ పోటీలు రెగ్యులర్​గా జరిగేవి కావని అన్నారు. 2006, 2010 తరువాత.. మళ్లీ ఈ సంవత్సరం జరిగాయని అన్నారు. పురుషులు, మహిళల విభాగాల్లో కూడా పతకాలు వచ్చాయని తెలిపారు. మెన్స్ఉ, మెన్స్ కేటగిరీల్లో ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్స్ రావడం ఇదే తొలిసారి అని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details