ఆదాయపన్ను అభియోగాలు - షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో ఐటీ సోదాలు - షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో మూడోరోజు ఐటీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:29 PM IST
IT Raids in Shirdi Electricals in Kadapa District :ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడైన విశ్వేశ్వర్ రెడ్డికి చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీలో మూడోరోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. కడప శివారులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్న షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సిఆర్పీఎఫ్ (Central Reserve Police Force) బలగాల మధ్య సోదాలు నిర్వహిస్తున్నారు. కడప ద్వారకా నగర్‌లోని విశ్వేశ్వర్‌రెడ్డి సోదరుడు కరుణాకర్ రెడ్డి ఆసుపత్రి, ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
IT Raids on Shirdi Sai Electricals Continues :షిర్డీసాయి ఎలక్ట్రికల్ కంపెనీలో స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు తయారు చేస్తున్నారు. వీటిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, బిహార్ ఇతర రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తున్నారు. చాలా వాటికి ఆదాయపు పన్ను చెల్లించలేదనే అభియోగాల మధ్య ఐటీ శాఖ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రాత్రి వరకు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.