చీరాల చేరుకున్న అమృత్ భారత్ రైలుకు ఘన స్వాగతం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 12:44 PM IST
Grand Welcome to Amrit Bharat Train at Chirala: ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించిన మాల్దాటౌన్-బెంగళూరు అమృత్ భారత్ రైలు బాపట్ల జిల్లాలోని చీరాలకు చేరుకుంది. అమృత్ భారత్ రైలుకు బీజేపీ నేతలు, రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. అమృత్ భారత్ రైలులో లోకోపైలట్లు సూట్లు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రైలును తిలకించేందుకు పెద్దఎత్తున స్థానికులు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. జనవరి 9 నుంచి మాల్దాటౌన్ నుంచి ఎస్.ఎం.వీ.టీ బెంగళూరుకు ప్రతి ఆదివారం ఎస్.ఎం.వీ.టీ బెంగళూరు నుంచి మాల్దాటౌన్‌కు ప్రతి మంగళవారం రైలు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
కాగా ప్రత్యేక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ రైలెక్కిన వారంతా అదుర్స్ అంటున్నారు. వంపు మార్గాలు, వంతెనలపైనా కుదుపుల్లేకుండా సాఫీగా ప్రయాణంసాగేలా అధునాతన బోగీలు అమర్చారు. ఈ రైళ్లలో మొత్తం 22 కోచ్‌లు ఉండగా 12 సెకండ్ క్లాస్ త్రీటైర్ స్లీపర్లు, 8 జనరల్, 2 గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. స్లీపర్ బోగీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సామాన్య ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా జనరల్ బోగీలు ఏర్పాటు చేశారు.