Formers Protest For Crop Irrigation in Krishna District : సాగునీరు మహాప్రభో..! చేతికందే వేళ పంట ఎండుతోందంటూ.. రోడ్డెక్కిన రైతన్న - సాగు నీరందక పంటలుఎండిపోతున్నాయని రైతుల ఆందోళనలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 30, 2023, 6:45 PM IST
Formers Protest For Crop Irrigation in Krishna District :కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కలవపాములలో సాగునీరు అందించాలంటూ రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దీంతో గుడివాడ-కంకిపాడు రహదారిలో ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో వేసిన పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. వెంటనే కాలువ నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన పంట చేతికందే సమయానికి నీరులేక ఎండిపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంట చివరి దశలో నీరు లేకపోతే నష్టపోతామంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Formers Facing Water Problems for Crops 2023 : ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్‌లో వేసే పంటలు సరిగా దిగుబడి రాక ఎండిపోయాయన్నారు. కరువు ఛాయలు అలుముకున్నాయని, ఇటువంటి పరిస్థితులలో కాలువల కింద, బోర్ల కింద వేసిన పంటలను ప్రభుత్వాధికారులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. నీళ్లు లేకపోతే రైతులు పెట్టిన పెట్టుబడి నష్టపోతామని ఆందోళన చెందుతున్నారు. వారంతా సన్న, చిన్నకారు, కౌలు రైతులేనని తక్షణమే నీళ్లు విడుదల చేయాలని కోరారు.