ఆంధ్రప్రదేశ్

andhra pradesh

shivaji_on_ap_politics

ETV Bharat / videos

ప్రజలను కుల, మతాల పేరుతో రెచ్చగొడుతున్నారు: శివాజీ - AP Political News

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 3:36 PM IST

Film Actor Shivaji Comments on AP Politics:ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ప్రశ్నించే తత్వతం పోయిందని ప్రముఖ సినీ నటుడు శివాజీ అన్నారు. ప్రజలను కుల, మతాల పేరుతో రాజకీయ నాయకులు రెచ్చగొడుతున్నారని శివాజీ విమర్శించారు. ఈ తరానికి అందాల్సిన వనరులు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని శివాజి మండిపడ్డారు. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే తత్వం ఉండాలని లేకపోతే ఇలానే రాజకీయ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తారని సూచించారు. పదేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా, యువత భవిష్యత్ కోసం పోరాడానని పేర్కొన్న శివాజీ, భారతీయ జనతా పార్టీ ఏపీకి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం వల్లే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు ఏ పార్టీలో లేనని, ప్రజల గొంతుకగా ఉంటానని శివాజీ పేర్కొన్నారు. అలాగే మెగా కుటుంబానికి ఏపీలో అభిమానగణం పెద్దదని వ్యాఖ్యానించిన శివాజీ ఆ కుటుంబానికి ఉన్న లోపాన్ని సరి చేసుకుంటే ప్రజాసేవలోకి రావచ్చని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details