ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers_Pelt_Stones on_Substation

ETV Bharat / videos

Farmers Pelt Stones on Substation in Peruru Sathya Sai District: సబ్​స్టేషన్​పై రాళ్లు విసిరిన రైతులు.. అధిక విద్యుత్​ కోతలంటూ.. - విద్యుత్​ కోతలతో విసిగిపోయిన రైతులు

By

Published : Aug 13, 2023, 11:27 AM IST

Farmers pelt stones on substation in Peruru Sathya Sai District: విద్యుత్​ కోతలతో విసిగిపోయిన రైతులు విద్యుత్​ సబ్​ స్టేషన్​పై రాళ్లు విసిరారు. విద్యుత్​ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. సరఫరా చేస్తున్న విద్యుత్​ నాసిరకంగా ఉంటోందని, మోటార్లకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేంజరిగిందంటే.. శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండల రైతులు.. వ్యవసాయ బావులకు విద్యుత్​ లోవోల్టేజీలో సరఫరా అవుతోందని.. పేరూరులోని సబ్​స్టేషన్​పై రైతులు రాళ్లు విసిరారు. విద్యుత్​ కోతలు సైతం అధికంగా ఉంటున్నాయని.. ఈ సమస్యను గతంలో అనేకసార్లు విద్యుత్​ శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు రైతులు తెలిపారు. విద్యుత్​ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విన్నవించుకున్న అధికారులు తమ గోడు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఒక్కసారిగా రాళ్లు విసరటంతో ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది భయంతో కార్యాలయం గదిలోనే ఉండిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని రైతులను శాంతింపజేశారు. 

ABOUT THE AUTHOR

...view details