ఆంధ్రప్రదేశ్

andhra pradesh

vedadri_lift_scheme

ETV Bharat / videos

Farmers Associations Demand Vedadri Lift Scheme : 'వేదాద్రి ఎత్తిపోతల'కు మరమ్మతులు చేసి సాగు నీరందించాలి.. రైతు సంఘాల డిమాండ్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 15, 2023, 7:14 PM IST

Farmers Associations Demand to Vedadri Lift Scheme Should be Repair:ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలంలోని కంచెల-వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు చేసి సాగునీరు అందించాలి రైతు, కౌలు రైతు సంఘాలు నేతలు డిమాండ్ చేశారు. రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ప్రతినిధుల బృందం నందిగామ రూరల్ మండలంలో అడవి రావులపాడు, లింగాలపాడు, తక్కెళ్ళపాడు, బెల్లంకొండవారిపాలెం, చెరువుకొమ్ముపాలెం గ్రామాలలో పర్యటించి రైతులను కలసి సాగునీటి ఎద్దడి గురించి విచారించింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు వల్ల మిర్చీ పత్తి వేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 

మిర్చి రైతులు ఎకరానికి కౌలుతో కలిపి 80 వేల వరకు పెట్టుబడి అయిందని సాగునీటి వసతి లేక మిర్చిచేలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు మండలాల పరిధిలో 17 ఎకరాల సాగునీరు అందించే వేదాద్రి ఎత్తిపోతల పథకం గత నాలుగు సంవత్సరాలుగా పట్టించుకునే నాధుడు లేక మూలన పడిందని అన్నారు. ప్రభుత్వాలు మారినా వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. తక్షణం వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మరమ్మతులు నిర్వహించి రైతులకు సాగునీరు అందించి ఆదుకోవాలని అన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైదులు మాట్లాడుతూ తక్షణం మాదారం ట్యాంకు నుంచి సాగర్ జలాలు విడుదల చేసి మిర్చి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details