ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Farmers_Agitation_on_Power_Cuts_in_Palnadu_District

ETV Bharat / videos

Farmers Agitation on Power Cuts in Palnadu District: 'ఆదుకుంటారా.. ఆత్మహత్య చేసుకోమంటారా..' అప్రకటిత విద్యుత్​ కోతలపై రైతుల ఆవేదన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2023, 7:29 PM IST

Farmers Agitation on Power Cuts in Palnadu District: విద్యుత్‌ కోతలు విధిస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కుతున్నా.. సీఎం జగన్‌ మాత్రం తన తన ప్రచారాన్ని ఆపటం లేదు. సాగుకు 9గంటల కరెంటు సరఫరా చేస్తున్నామంటూ ఊక దంపుడు మాటలు మాట్లాడుతునే  ఉన్నారు. కనీసం 2 గంటలు కూడా కరెంటు సరఫరా లేక మిరప పంట ఎండిపోతోందంటూ.. పల్నాడు జిల్లా మాచవరం సబ్ స్టేషన్ ఎదుట తురకపాలెం రైతులు ఆందోళన చేశారు. పురుగు మందు డబ్బాలు చేతపట్టుకుని.. కరెంట్​ కోతల వల్ల ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆక్రోశించారు. 

కర్నూలు జిల్లా ఈదుల దేవరబండలో.. రైతులు సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అప్రకటిత విద్యుత్‌ కోతలపై ఏఈ సమాధానం చెప్పాలని నిలదీశారు. జగన్‌ ఇలాకా పులివెందుల ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట లింగాల మండల రైతులు ధర్నా చేశారు. రెండు రోజులుగా విద్యుత్ సక్రమంగా లేక అరటి తోటతో సహా ఇతర ఉద్యాన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details