ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Ex_union_Minister_Chinta_on_Chandrababu_Arrest

ETV Bharat / videos

Ex Union Minister Chinta Mohan on Chandrababu Arrest: "రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. ఇది ముమ్మాటికీ నిజం"

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 4:50 PM IST

Ex Union Minister Chinta Mohan on Chandrababu Arrest: రాజకీయ కక్షతోనే టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేశారనేది ముమ్మాటికీ వాస్తవమని.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత చింతా మోహన్‍ అన్నారు. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం పూర్తిగా అరెస్టుల రాష్ట్రంగా తయారైందని విమర్శించారు. తిరుపతిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందిచాలని అన్నారు. చంద్రబాబు అరెస్టులో బీజేపీ పాత్ర ఉందని ఆరోపించారు. పరిపాలను పక్కనపెట్టిన జగన్‌... కక్ష రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అరెస్టుల ప్రదేశ్‌గా మార్చారని మండిపడ్డారు. రాష్ట్రంలోని ఐపీఎస్‍ అధికారులు ఇండియన్ పోలీస్ సర్వీసులో ఉన్నట్లు లేదని.. అది ఇండియన్ పొలిటికల్ సర్వీసుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్గదర్శి చిట్​ఫండ్​పై ముఖ్యమంత్రి జగన్‍ కక్ష సాధింపు చర్యలు ఎందుకు అని ప్రశ్నించారు. పాత పెన్షన్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్​లో అమలు చేయాలని డిమాండ్‍ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details