ఆంధ్రప్రదేశ్

andhra pradesh

dgp_on_ganja

ETV Bharat / videos

DGP on Chandrababu Jail Letter రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు రాసినట్టుగా వచ్చిన లేఖపై దర్యాప్తు జరుగుతోంది: డీజీపీ - Nara Bhuvaneshwari Yatra

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 5:04 PM IST

DGP on Ganja Transportation and Cricket Betting:రాష్ట్రంలో క్రికెట్ బెట్టింగ్, గంజాయిపై సీరియస్​గా యాక్షన్ తీసుకుంటున్నట్లు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గంజాయి పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తుందని దీనిని నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో నక్సల్ ప్రభావం లేదని చెప్పలేమని దీనిపై పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్లు డీజీపీ తెలిపారు.  చంద్రబాబు జైలు నుంచి రాసినట్టుగా వచ్చిన లేఖపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. చంద్రబాబుకు జైలులో తగిన భద్రత ఉందన్నారు. ప్రస్తుతం బయటికి వచ్చిన లేఖపై ఇంకా క్లారిటీ లేదని, అది ఎక్కడి నుంచి వచ్చిందన్నది తేలిన తర్వాత చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు టీడీపీ నేతల నిరసన కార్యక్రమాలని అడ్డుకుంటున్నట్టుగా వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. టీడీపీ నేతలు ప్రతిరోజు నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారని.. ఎక్కడా వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్​కి విఘాతం కలిగితే ఖచ్చితంగా అక్కడ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. నారా భువనేశ్వరి యాత్రపై ఇంకా అనుమతులు కోరలేదని.. స్థానిక పోలీసుల ఇలాంటి వాటిపై నిర్ణయం తీసుకుంటారన్నారు.

ABOUT THE AUTHOR

...view details