Cracks to Foundation of Jagananna Colony Houses: జగనన్న కాలనీ కష్టాలు.. చిన్న వర్షానికే పునాదులకు బీటలు - జగనన్న కాలనీ వీడియోలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 4, 2023, 7:58 PM IST
Cracks to Foundation of Jagananna Colony Houses: అనంతపురం జిల్లా గుత్తి మండలం టి కొత్తపల్లి గ్రామంలో ఇటీవల పేద ప్రజలకు 50 జగనన్న కాలనీలో ఇళ్లస్థలాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇళ్లస్థలాల్లో వెంటనే ఇల్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి తెచ్చారు. ఇళ్లు నిర్మించుకోవాలని... లేకుంటే ఇళ్ల పట్టాలు రద్దు అవుతాయని చెప్పడంతో... కొంత మంది లబ్ధిదారులు తమకు ఇచ్చిన జగనన్న కాలనీ స్థలాలలో పునాదులు వేసుకున్నారు. నిన్న రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి పునాదులు పూర్తిగా చీలిపోయాయి. చిన్న వర్షానికే ఇళ్ల పునాదులు చీలికలు వచ్చాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునాదులకే ఇలా అయిపోతే.. ఇల్లు నిర్మించిన తర్వాత కూలిపోతే ఎలా అని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సౌడు నేలలో ఇళ్ల నిర్మించేందుకు స్థలాలు ఇస్తే ఎలా అంటూ లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం ఇల్లు నిర్మించుకోవాలని అధికారులు ఒత్తిడి పెట్టడం వల్లే... తాము అప్పు చేసి పునాదులు నిర్మించుకున్నామని తెలిపారు. ఈ కొద్దిపాటి వర్షానికి ఇలా అయిపోతే ఎలా అంటూ... లబ్ధిదారుల ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమకు సౌడు నేలలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను రద్దుచేసి, ఇళ్ల నిర్మాణానికి అనువుగా ఉండే ప్రాంతాల్లో పట్టాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.