ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

CM Jagan Visited Tirumala Srivari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం జగన్‌ - CM Jagan Visited ttd

🎬 Watch Now: Feature Video

CM_Jagan_Visited_Tirumala_Srivari

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 19, 2023, 6:21 PM IST

CM Jagan Visited Tirumala Srivari:తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో గత రెండు రోజులుగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు చిన్నశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి విహరించారు. వాహన సేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో చిన్నశేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. 

CM Jagan Paid Obeisance at Srivari Temple:తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి మంగళవారం నాడు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకొని, మ్రొక్కులు చెల్లించారు. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆలయ అర్చకులు.. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన ముఖ్యమంత్రి జగన్..స్వామివారిని దర్శించుకొని, మ్రొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత రంగనాయకుల మండపంలో సీఎంకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. తితిదే ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, తితిదే ఈవో ధర్మారెడ్డిలు స్వామివారి తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారి దర్శనాన్ని ముగించుకుని సీఎం జగన్..పద్మావతి అతిథి గృహానికి బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట డిప్యూటీ సీఎంలు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్.కే.రోజాలు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details