ఏ పథకాలు పొందని వారికి ప్రత్యేకం - బటన్ నొక్కి నిధులు విడుదల చేసిన జగన్ - AP Govt Funds news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 5, 2024, 5:35 PM IST
CM Jagan Released Funds to Eligible Beneficiaries:ప్రభుత్వ పథకాలకు అర్హులై ఉండి, ఏదైనా కారణం చేత లబ్ధి అందని వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. సుమారు 68,990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు.
CM Jagan Comments: ''రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలకు అన్ని రకాలుగా అర్హత ఉండి, ఏదైనా కారణం చేత లబ్ధి పొందని వారిని గుర్తించి, ఈరోజు వారికి ప్రత్యేకంగా సాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 68వేల 990 మంది అర్హుల ఖాతాల్లో రూ.97 కోట్ల 76 లక్షలు జమ చేశాం. 5 విడతల్లో కలిపి రూ.15వందల కోట్ల సాయం అందించాం. పేదవాళ్లు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో వివక్ష, లంచాలకు తావు లేకుండా ప్రతి 6 నెలలకోసారి లబ్ధి చేకూరేలా చూస్తున్నాం. ఏదైనా కారణంతో గత ఆరు నెలల్లో వివిధ పథకాలు పొందని వారికి బటన్ నొక్కి నిధులు విడుదల చేశాం.'' అని సీఎం జగన్ అన్నారు.