ఆంధ్రప్రదేశ్

andhra pradesh

chandrababu_naidu_and_bhuvaneswari_in_mary_matha_temple_vijayawada

ETV Bharat / videos

గుణదల మేరీమాతను దర్శించుకున్న చంద్రబాబు దంపతులు - ఘనంగా సెమీ క్రిస్మస్​ వేడుకలు - గుణదల మేరీమాత చర్చ్​ తాజా వార్తలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2023, 5:16 PM IST

Chandrababu Naidu And Bhuvaneswari In Mary Matha Temple Vijayawada : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు దంపతులు గుణదల మేరీమాతను దర్శించుకున్నారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరికి టీడీపీ నేతలు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, జవహర్, వర్ల రామయ్య తదితరులు స్వాగతం పలికారు. మేరీమాత ఆలయంలో చంద్రబాబు దంపతులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. మేరిమాత విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేశారు. చర్చి విచారణ గురువులు చంద్రబాబు దంపతులకు మేరీమాత చిత్రపటాన్ని అందజేశారు. 

Chandrababu Naidu  Celebrate Christmas Celebrations Gunadala Church : చంద్రబాబును చూసేందుకు టీడీపీ కార్యకర్తలు గుణదల చర్చి వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలుత విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ కార్యక్రమంలో వర్ల రామయ్య, జవహర్‌, దేవినేని ఉమ, అశోక్‌ బాబు, కొల్లు రవీంద్ర, నాగుల్‌ మీరా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details