Attempt to Murder Case Filed on Julakanti Brahma Reddy మాచర్ల టీడీపీ ఇంచార్జ్ జూలకంటిపై హత్యాయత్నం కేసు నమోదు.. - టీడీపీ నేతలు కార్యకర్తలపై హత్యాయత్నం కేసు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2023, 7:35 AM IST
Attempt to Murder Case Filed on Julakanti Brahma Reddy మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిపై వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఆగస్టు 30న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలోని అమ్మవారి జాతరలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి ఏ12 గా బ్రహ్మారెడ్డి మరో ఐదుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో ఏ10 అయిన రాజబోయిన మధు యాదవ్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆయన రిమాండ్ రిపోర్టులో బ్రహ్మారెడ్డి పేరు చేర్చారు. మధుయాదవ్ చెప్పడంతోనే బ్రహ్మారెడ్డి పేరును రిమాండ్ రిపోర్టులో చేర్చినట్లు పోలీసులు చెబుతున్నారు. బ్రహ్మారెడ్డిపై అక్రమంగా హత్నాయత్నం కేసు నమోదు చేయడం దుర్మార్గమని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి కక్షసాధింపులో భాగంగానే బ్రహ్మారెడ్డిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వైసీపీ నాయకులపై నామమాత్రపు కేసులు పెట్టిన పోలీసులు.. బాధితులైన టీడీపీ నేతలు, కార్యకర్తలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని విమర్శించారు. టీడీపీ వర్గీయులు గ్రామ దేవతకు మొక్కులు సమర్పించేందుకు వెళ్తున్న సమయంలో.. టీడీపీ వర్గీయులు చల్లిన కుంకుమ తమ మీద పడిందని వైసీపీ శ్రేణులు వివాదానికి దిగిన విషయం తెలిసిందే.