Attack on Young Woman for Refusing Love: ప్రేమను నిరాకరించిందని.. నడిరోడ్డుపై యువకుడి దాడి.. తల్లీకూతుళ్లకు తీవ్ర గాయాలు - Lover attack on girl in kurnool district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 27, 2023, 12:51 PM IST
Attack on Young Woman for Refusing Love: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో చిరంజీవి అనే యువకుడు దాడి చేయడంతో బీటెక్ చదువుతున్న విద్యార్థినితోపాటు ఆమె తల్లి గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై విద్యార్థిని, ఆమె తల్లి వెళ్తుండగా యువకుడు ఒక్కసారిగా విద్యార్థినిపై దాడి చేశాడు. దాంతో ద్విచక్ర వాహనంపై నుంచి యువతి, ఆమె తల్లి కింద పడ్డారు. దాడి నుంచి తన కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించిన తల్లిపై కూడా యువకుడు కత్తితో దాడి చేశాడు.
చీకట్లో తల్లీకుమార్తెలిద్దరూ బిగ్గరగా అరవడంతో సమీపంలో ఉన్నవారు ఏమి జరుగుతుందోనని దగ్గరికి వెళ్లారు. యువకుడు దాడి చేస్తుండటంతో అతడిని పట్టుకుని తల్లీకుమార్తెలను రక్షించి.. యువకుడికి దేహశుద్ధి చేశారు. దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దాడిలో తల్లీకుమార్తెలకు బలమైన గాయాలు కాగా.. వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన యువకుడు ఇంటర్ వరకు చదువుకున్నాడు. గత కొంత కాలంగా విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతుండగా.. ఆమె అతడి ప్రేమను నిరాకరించడంతో కత్తితో దాడికి పాల్పడ్డాడు.