AIYF Protest: ఉద్యోగాలు భర్తీ చేయకుంటే తాడేప్లలి ప్యాలెస్‌ను ముట్టడిస్తాం.. ఏఐవైఎఫ్ హెచ్చరిక - ఆంధ్రప్రదేశ్‌లో ఏఐవైఎఫ్ ధర్నా
AIYF Protest On Various Demands: అఖిల భారత యువజన సమాఖ్య పిలుపు మేరకు విద్యార్థి సంఘాలు కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. గుంటూరు కలెక్టరేట్ వద్దకు చేరుకున్న ఏఐవైఎఫ్ నాయకులను పోలీసులు అడ్డుకోవటంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఏఐవైఎఫ్ నాయకులు అర్థనగ్నంగా.. తలకిందులుగా నిలబడి నిరసన తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడికి యత్నిస్తామన్నారు. ప్రతిపక్షంలో నిరుద్యోగ భేరీలు.. యువభేరీలు వంటి కార్యక్రమాలు నిర్వహించి.. ఈ రోజు నిరుద్యోగులను కలిసే అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. మహా మ్యూజియం నుంచి ర్యాలీగా బయలుదేరి ఫ్లకార్డుల ప్రదర్శన చేశారు. సీఎం జగన్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నోటీఫికేషన్ ఇచ్చి భర్తీ ప్రక్రియను చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.