ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Aha_Canteen_Closed_on_Second_Day_in_Atmakur

ETV Bharat / videos

Aha Canteen Closed on Second Day in Atmakur: ప్రారంభించిన రెండో రోజే కనిపించని 'ఆహా క్యాంటీన్​' - ఆహా క్యాంటీన్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 13, 2023, 5:01 PM IST

Aha Canteen Closed on Second Day in Atmakur: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ఆహా క్యాంటీన్ రెండవ రోజే మాయమైంది. ప్రభుత్వ కార్యాలయాలకు, ఆసుపత్రులు, ఇతర అవసరాల నిమిత్తం పట్టణాలకు వచ్చే వారు అక్కడ భోజన సదుపాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిచోట్ల సమీపంలో ఎక్కడా ఆహారశాల ఉండదు.. ఉన్నా అధిక ధరల కారణంగా అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో అందుబాటు ధరల్లో, నాణ్యమైన భోజనం అందుబాటులోకి తెచ్చేలా మెప్మా ఆధ్వర్యంలో ‘ఆహా’ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. 

పట్టణాల్లో స్వయం సహాయక సంఘాలు వీటిని నిర్వహిస్తాయి. 30 రూపాయలకే పెరుగు అన్నం, పులిహోర, సాదా బిర్యానీని బాక్స్​ల ద్వారా ఇక్కడ విక్రయిస్తారు. ఈ క్రమంలో ఇటీవల ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోనూ ఈ ఆహా క్యాంటీన్​ను ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి దానిని ప్రారంభించారు. కానీ ఆహా క్యాంటీన్​ ప్రారంభించిన రెండవ రోజే అది అక్కడ లేకపోవడంతో.. భోజనం కోసం వచ్చినవారు వెనుదిరిగి వెళ్లారు. ఇలా పెట్టిన రెండవ రోజు క్యాంటీన్​ను ఎత్తేయడం ఏమిటి అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details