ఆంధ్రప్రదేశ్

andhra pradesh

11-Months-Old Boy Falls In Bucket and Died

ETV Bharat / videos

11 Months Old Boy Died : ఏడాదైనా కాకుండానే నూరేళ్లు నిండాయి..! ఆడుకుంటూ నీళ్ల బకెట్​లో పడిన బాలుడు.. ఆస్పత్రికి వెళ్లేలోగా.. - నీటి టబ్బులే పడి బాలుడు మృతి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 17, 2023, 12:23 PM IST

11-Months-Old Boy Falls In Bucket and Died in Karnool : కర్నూలు జిల్లా ఆదోని పట్టణం రాజీవ్ గాంధీ నగర్​లో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి టబ్బులో పడి 11 నెలల హర్షవర్ధన్ మృతి చెందాడు. భూషప్ప, నర్సమ్మ దంపతుల ఏకైక బిడ్డ హర్షవర్దన్​. ఆడుకుంటుండగా  ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీళ్ల బకెట్​లో పడ్డ బాలుడి అకస్మిక మరణంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

latest crime news 2023 : సోమవారం మధ్యాహ్నం 12:28 గంటలకు బాలుడి తండ్రి భూషప్ప పొలానికి బయలుదేరాడు. కాసేపటికి ఇంటి నుంచి ఫోన్​ వచ్చింది. బాలుడు ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ నీటి టబ్బులో పడ్డాడని, మాట్లాడట్లేదని చెప్పారు. అతడు వెంటనే ఇంటికి పరుగులు తీశాడు. బాలుడ్ని తీసుకొని ఆదోని పట్టంలోని ఆస్పత్రికి వెళ్లాడు. మూడు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగారు. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయాడని చెప్పారు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details