కడప జిల్లా రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. సీఎం జగన్ ప్రకటించిన నవరత్నాలు ఏ ఒక్కటీ అమలు కాలేదని జనసేన నేత ముఖరంచాంద్ ఆగ్రహించారు. వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలన ఘోరంగా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై భాజపా నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నా మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోవటం దారుణమన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే భాజపా విమర్శలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
'వైకాపా వంద రోజుల పాలన... అతి ఘోరం' - rajampeta
వైకాపా ప్రభుత్వ వంద రోజుల పాలన ఘోరంగా ఉందని రాజంపేట పార్లమెంట్ జనసేన కన్వినర్ ముఖరంచాంద్ విమర్శించారు.
జనసేన