ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఐక్యంగా ముందుకెళితేనే సమస్యల పరిష్కారం" - rajampeta

కడప జిల్లా రాజంపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రాజంపేట- రైల్వేకోడూరు నియోజకవర్గ స్థాయి యాదవ ఉద్యోగ సంఘం సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు.

ఐక్యంగా ఉందాం పోరాడి సాధించుకుందాం

By

Published : Aug 18, 2019, 9:14 PM IST

ఐక్యంగా ఉందాం పోరాడి సాధించుకుందాం

ఐక్యంగా ఉందాం.. సంఘాన్ని బలోపేతం చేసుకుందాం.. సమస్యలను సాధించుకుందామని యాదవ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. కడప జిల్లా రాజంపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గ స్థాయి యాదవ ఉద్యోగ సంఘం సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటికే 9 జిల్లాలో పూర్తిగా కమిటీలు వేశామని వెంకటేశ్వర్లు చెప్పారు. కమిటీల ద్వారా సంఘాన్ని బలోపేతం చేసుకుంటూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ముందుకు వెళ్తామని చెప్పారు. సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 30 వేల మంది యాదవ ఉద్యోగులు సంఘంలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా యాదవ ఉద్యోగులు ఎక్కడెక్కడ ఉన్నారు. వారిని గుర్తించి, సంఘంలో చేర్చుకొని, తద్వారా సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. సంఘం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details