వివాహిత అనుమానస్పదస్థితిలో మృతిచెందిన ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. పట్టణంలోని బ్రహ్మణ వీధికి చెందిన విశ్రాంత కోర్టు ఉద్యోగి రమణాచార్యులు భార్య శాంతి గత నాలుగురోజులుగా కనిపించడంలేదు. దింతో ఆయన చుట్టుపక్కల గాలించినా ఫలితం లేకపోవండంతో ఒకటో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రమణాచార్యలు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఆయన వెళ్లి బావిలో చూడగా శాంతి మృతదేహం కనిపించింది. విషయం పోలీసులకు తెలపగా శవాన్ని తీసి శవపరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అనుమానస్పదస్థితిలో మహిళ మృతి - women died
నాలుగురోజుల క్రితం అదృశ్యమైన మహిళ ఇంట్లో ఉన్న బావిలోనే శవంగా కనిపించిన ఘటన కడప పట్టణం బ్రహ్మణవీధిలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
మహిళ మృతి