రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. కడప జిల్లా వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. మందడంలో మహిళల పట్ల పోలీసుల ప్రవర్తనను ఆయన ఖండించారు. మహిళలు అని చూడకుండా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించడం దారుణమన్నారు.
'కాంగ్రెస్ గతంలో ఏం చెప్పిందో... రాష్ట్రంలో అదే జరుగుతోంది' - తులసిరెడ్డి వార్తలు
మందడంలో మహిళల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును... పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి తప్పుబట్టారు. రాష్ట్రం ఆటవిక రాజ్యం అయిందని ఆరోపించారు. ఇలాంటి రాజ్యం ఎక్కువ కాలం ఉండదని పేర్కొన్నారు.
తులసిరెడ్డి
వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం రాక్షస రాజ్యమవుతుందని... ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చెప్పిందని తులసిరెడ్డి గుర్తుచేశారు. ఇప్పుడు అదే జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలు తిరగుబాటు చేస్తే రౌడీరాజ్యం పారిపోక తప్పదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించాలని తులసిరెడ్డి హితవు పలికారు.
ఇదీ చదవండి:మహాధర్నాలో పోలీసుల అత్యుత్సాహం... సొమ్మసిల్లిన మహిళ