ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ కాంస్య విగ్రహం సిద్ధం

By

Published : Feb 21, 2021, 11:59 AM IST

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ కాంస్య విగ్రహాన్ని తెనాలిలో రూపొందించారు. ఈ నెల 22న ఆయన వర్ధంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతిష్ఠించనున్నారు.

Uyyalawada Narasimha Reddy's huge bronze statue in kadapa district
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ కాంస్య విగ్రహం సిద్ధం

కడప జిల్లా ప్రొద్దుటూరులో స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారీ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 22న ఆయన వర్ధంతి సందర్భంగా ఆవిష్కరించేందుకు 12 అడుగుల ఎత్తు, దాదాపు వెయ్యి కిలోలకు పైగా కంచును ఉపయోగించి తెనాలిలో విగ్రహాన్ని రూపొందించారు.

బుడ్డా వెంగళరెడ్డి కంచు విగ్రహం

విగ్రహ కమిటీ వారి సూచనలతో గుర్రంపై ఉన్న రూపును తీర్చిదిద్దినట్లు శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు తెలిపారు. దాన కర్ణుడిగా పేరొందిన బుడ్డా వెంగళరెడ్డి కంచు విగ్రహాన్ని సైతం తయారు చేసినట్లు చెప్పారు. ఈ విగ్రహాన్ని కూడా ప్రొద్దుటూరులో ఆవిష్కరించనున్నారని వారు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details