ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైదుకూరులో ఆర్టీసీ యూనియన్ కార్మికుల ధర్నా - union rtc

కలసి పోరాడుదాం..హక్కులను సాధించుకుందాం అంటూ మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ఆందోళన చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.

'మైదుకూరులో ఆర్టీసీ యూనియన్ కార్మికుల ధర్నా'

By

Published : May 17, 2019, 7:27 PM IST

'మైదుకూరులో ఆర్టీసీ యూనియన్ కార్మికుల ధర్నా'

కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు ఆందోళన చేశారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సుల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. అక్రమ రవాణాను అరికట్టి ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. ఫిబ్రవరి 5న రవాణా మంత్రి సమక్షంలో కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలని కార్మికులు స్పష్టం చేశారు. విధుల్లో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలోని పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ప్రజా రవాణాను బలోపేతం చేసేలా బస్సుల సంఖ్యను గణనీయంగా పెంచాలని విజ్ఞప్తి చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details