shop owner complained against YCP leader: రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు వైసీపీ నాయకుల ఆగడాలు మితిమిరి పోతున్నాయి. తమకు అడ్డువచ్చిన వారిపై దాడులు చేయడం లేదా బెదిరించడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని అధికార పార్టీ నేతల హంగామా అంతా ఇంతా కాదు.. గత కొంత కాలంగా దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కడపలో ఓ వైసీపీ నాయకుడు నగర పాలక సంస్థ గదులను వేలంలో దక్కించుకున్నాడు. అంతే ఎప్పటినుంచో ఆ గదులలో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయమన్నాడు. అంతటితో ఆగకుండా రాత్రికి రాత్రే సుమారు 15 మందిని తీసుకొచ్చి మెకానిక్ షెడ్లో ఉన్న సామాగ్రినంత బయటపడేశాడు. తాను గత తొమ్మిది సంవత్సరాలుగా ఆ షాప్‌లోనే ఉంటున్నానని.. కడపకు చెందిన వైసీపీ నాయకుడికి స్లబ్ లీజ్ తీసుకుని.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాధితుడు రమణ తెలిపాడు. తాను అద్దె చెల్లిస్తానని చెప్పినప్పటికీ వినిపించుకోలేదని అతను వాపోయాడు.
shop vandalized: రెచ్చిపోయిన వైసీపీ నేత.. కోర్టు స్టే ఉన్నా దౌర్జన్యం
mechanic shop vandalized: రోజురోజుకీ వైసీపీ దాడులు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కడపలో ఓ వైసీపీ నాయకుడు లీజుకిచ్చిన గదులను ఖాళీ చేయలేదని మెకానిక్ షెడ్లోని సామాగ్రినంతా బయటపడేశారు. కడప నగరపాలక సంస్థ గదులను ఓ వైసీపీ నాయకుడు లీజుకు తీసుకున్నారు. ఆ వైసీపీ నాయకుడి వద్ద మూడు గదులను రమణ అనే వ్యక్తి సబ్ లీజుకు తీసుకుని మెకానిక్ షెడ్డు నిర్వహిస్తున్నారు. నాలుగైదు నెలల నుంచి తన గదులను ఖాళీ చేయాలంటా వైసీపీ నేత తనపై ఒత్తిడి తెచ్చారని రమణ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ మెకానిక్ షెడ్డులోని సామాగ్రిని బయటపడేశారని బాధితుడు వాపోయారు.
తనకు షాప్ ఖాళీ చేయడాని కొంత సమయం కావాలంటూ కోర్టుకు వెళ్లడంతో.. ఏడాది పాటు షాప్ నిర్వహించుకోవడానికి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందనీ రమణ వెల్లడించాడు. ఆలోగా వేరే షాప్ చూసుకుందామనుకుంటే.. రాత్రి సమయంలో వచ్చి షాప్‌లోని వస్తువులను చిందరవందరగా చేశారని, కొన్ని వస్తువులను వ్యాన్‌లో తీసుకెళ్లారని బాధితుడు వాపోయాడు. గత తొమ్మిది సంవత్సరాల నుంచి నెలకు రూ. 22 వేల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ.. మెకానిక్ షెడ్డు నిర్వహిస్తున్నట్లు రమణ తెలిపాడు. ఈ మధ్య కాలంలో నెలకు రూ.30 వేల అద్దె చెల్లిస్తున్నట్లు రమణ పేర్కొన్నాడు. క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్నప్పటికీ.. గత నాలుగైదు నెలల నుంచి ఖాళీ చేయాలని వైసీపీ నాయకుడు ఒత్తిడి తీసుకొచ్చినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే తన షాప్‌పై దాడి చేసినట్లు పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ తన సామాగ్రిని బయటపడేసారంటూ బాధితుడు పోలీసుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సరైన గదులు దొరికే వరకు సమయం ఇవ్వాలని కోరారు. పోలీసులుఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
'గత తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ షాప్ నిర్వహించుకుంటున్నాం. సుమారు రూ. 30వేల అద్దె చెల్లిస్తున్నాం. ఈ మధ్య వేరే వ్యక్తికి షాప్ వచింది.. షాప్ ఖాళీ చేయమన్నారు.. మేము ఒక సంవత్సరం సమయం కావాలని అడిగితే ఆయన వినలేదు. మేము షాప్ ఖాళీ చేయడంపై కోర్టుకు వెళ్లాం. కోర్టు సంవత్సరం పాటు కొనసాగడానికి స్టే ఇచ్చింది. ఈలోగా గదులను ఖాళీ చేయకపోవడంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో 15 మందిని తీసుకొచ్చి మెకానిక్ షెడ్ లో ఉన్న సామాగ్రిని మొత్తం బయటపడేశారు' -రమణ, బాధితుడు