శక్తికి మించి అప్పు చేయడం వైకాపాకు పరిపాటిగా మారిందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విమర్శించారు. వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందని, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం పరాకాష్ఠకు చేరిందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో లక్ష కోట్ల అప్పు చేస్తే... ప్రస్తుత సీఎం ఏడాది కాలంలోనే లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేశారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుశాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీనే అని ఆరోపించారు.
'వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది'
వైకాపా పాలనలో రాష్ట్రం అప్పుల కుప్ప అయ్యిందని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. అప్పు చేసి పప్పు కూడు తినే అలవాటును మానుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పు శాతం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు.
ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ తులసి రెడ్డి