కరోనా వ్యాప్తి నివారణలో, లాక్ డౌన్ సమస్యల పరిష్కారంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన... జాతీయ స్థాయిలో రెడ్ జోన్ జిల్లాల శాతం 17.66 శాతం ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో 7.6 శాతం ఉండడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంలేదని రాష్ట్ర ప్రత్యేకాధికారి హరినారాయణ స్పష్టంగా చెప్పారన్నారు. ప్రతిఒక్కరికీ మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పినా... క్షేత్రస్థాయిలో అది జరగడంలేదని ధ్వజమెత్తారు. ప్రజలకు రేషన్తో పాటు నిత్యావసరాలు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేశారు.
'వైకాపా ప్రభుత్వం అన్నింట్లో విఫలమైంది' - వైకాపా ప్రభుత్వంపై మాట్లాడిన తులసిరెడ్డి
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని... రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆరోపించారు. లాక్ డౌన్ సమస్యల పరిష్కారంలోనూ వైఫల్యం చెందిందని విమర్శించారు.
!['వైకాపా ప్రభుత్వం అన్నింట్లో విఫలమైంది' tulasi reddy criticizes ycp government](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7029567-586-7029567-1588421801540.jpg)
వైకాపా ప్రభుత్వంపై తులసిరెడ్డి విమర్శలు