ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YS Viveka Murder Case: 'కడప వదిలి వెళ్లిపోకుంటే.. బాంబులేస్తాం' - వివేకా హత్య కేసు వార్తలు

ఎందరో నేరగాళ్ల ఆటకట్టంచింది సీబీఐ. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ! అలాంటి సీబీఐ సిబ్బంది జోలికి ఎవరైనా బెదిరించగలరా? బాంబులేసి లేపేస్తాం అని బెదిరించగలరా? ఎక్కడైనా ఏమోగానీ కడపలో మాత్రం అదే జరుగింది. వివేకా హత్య కేసును కొలిక్కి తెచ్చేందుకు శ్రమిస్తున్న సీబీఐ సిబ్బందిని కడప వదిలి వెళ్లకపోతే బాంబులేస్తామని బెదిరించడం దుమారం రేపుతోంది.

YS Viveka Murder Case
YS Viveka Murder Case

By

Published : May 12, 2022, 5:42 AM IST

సీఎం జగన్ సొంత బాబాయి వివేకా హత్యకేసు విచారణ.. సీబీఐ సిబ్బందికి సవాళ్లు విరుసుతోంది. సిబ్బందికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. విచారణ సైతం మందగించింది. చాలా మంది అధికారులు కడప నుంచి దిల్లీ వెళ్లిపోయారు. కడపలో కేవలం సీబీఐకి చెందిన ఎస్​ఐ స్థాయి అధికారి,మరో ముగ్గురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. నిత్యం వీరు రెండు వాహనాల్లో.. కడప అతిథి గృహం నుంచి కేంద్ర కారాగారం అతిథి గృహానికి వెళ్లి వస్తుంటారు.

'కడప వదిలి వెళ్లిపోకుంటే.. బాంబులేస్తాం'

ఈనెల 8న మధ్యాహ్నం కడప నుంచి కేంద్ర కారాగారం సమీపంలోని పంజాబీ డాబాలో భోజనం తెచ్చేందుకు .. సీబీఐకి చెందిన ఇన్నోవా వాహనంలో డ్రైవర్ వలీబాషా వెళ్లాడు. పాత బైపాస్‌లోని పద్మావతి వీధి నుంచి వాహనం వెళ్తుండగా ముసుగు ధరించిన వ్యక్తి దాన్ని అడ్డగించాడు. బాంబు లేసి లేపేస్తాను విజయవాడ వెళ్లి పోవాలని అతను బెదిరించినట్లు సీబీఐ వాహన డ్రైవర్ చిన్నచౌక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివేకా కేసు విచారణ చేస్తున్న బృందాన్నీ తిరిగి వెళ్లాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ముసుగు ధరించిన వ్యక్తి సీబీఐకి చెందిన మరో వాహన కదలికలనూ వారం నుంచి గమనిస్తున్నట్లు చెప్పాడని వెల్లడించాడు. ఈనెల 6న తాను హైకోర్టుకు వెళ్లి కారు పార్కింగ్ చేసిన విషయాన్ని చెప్పినట్లు సీబీఐ డ్రైవర్ ఫిర్యాదులో తెలిపారు. ఆరోజు హైకోర్టుకు వెళ్లేముందు విజయవాడ రైల్వేస్టేషన్ లో సీబీఐ పీపీ చెన్నకేశవులను ..కారులో ఎక్కించుకున్న విషయాన్నీ దుండగుడు తనతో ప్రస్తావించాడని పేర్కొన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి జైలులో ఉన్నంతవరకే మీ ఆటలు సాగుతాయ్ ఆయన బెయిలుపై బయటికొస్తే సీబీఐ బృందాన్ని చంపేస్తాడని బెదిరించినట్లు సీబీఐ డ్రైవర్ వలీబాషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు..

సీబీఐ వాహన డ్రైవర్ ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌకు పోలీసులు ఈనెల 9న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వాహనాన్ని దుండగుడు అడ్డగించిన మార్గంలోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించి దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఫిర్యాదు చేసి రెండ్రోజులైనా.... నిందితుడిని పోలీసులు పట్టుకోక పోవడంపై ...సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:సీబీఐ అధికారులకు బెదిరింపులు... పోలీసులకు ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details