కడప జిల్లాలో ఈనెల 1న జరిగిన ఇంతియాజ్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జోగి అమీర్ అలీ, జోగి అదిల్, జోగి సుహైల్, జోగి సునేద్ అనే నలుగురు అన్నదమ్ములు బతుకుదెరువు కోసం కడపకు వచ్చి చికెన్ సెంటర్లో పనిచేసేవారు. వీరంతా నకాష్ వీధిలో ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని నివసించేవారు. కడప నగరానికి చెందిన ఇంతియాజ్ అనే వ్యక్తి సైతం అదే చికెన్ సెంటర్లో పనిచేసేవాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురూ డబ్బులు బాగా సంపాదిస్తున్నారనే దురాశతోఇంతియాజ్ రోజు తాగి వచ్చి డబ్బులు ఇవ్వాలని ఆ నలుగురినీ బెదిరించేవాడు. విసిగిపోయిన నలుగురు అన్నదమ్ములు ఎలాగైనా ఇంతియాజ్‌ను హత్య చేయాలని పథకం వేశారు. ఈనెల 1న రాత్రి తమ ఇంటికి ఇంతియాజ్‌ను పిలిచారు. ఇంతియాజ్‌కు మద్యం తాగించి చపాతీలు చేసే కర్రతో తలపై బలంగా బాది హత్య చేసి పారిపోయారు. ఈ మేరకు కేసు వివరాలను వెల్లడించిన డీఎస్పీ సూర్యనారాయణ నిందితులకు న్యాయస్థానం రిమాండు విధించిందని తెలిపారు.
వ్యక్తి హత్య కేసులో యూపీకి చెందిన నలుగురి అరెస్టు
కడపలో ఈనెల 1న జరిగిన వ్యక్తి హత్య కేసులో పోలీసులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురిని అరెస్టు చేశారు. నిందితులకు న్యాయస్థానం రిమాండు విధించిందని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. డబ్బుల కోసం జరిగిన వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు పేర్కొన్నారు.
ఇంతియాజ్ హత్య కేసులోని నిందితులు అరెస్టు