మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా... భాజపా నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య కేసులో విచారణకు హాజరుకావాలంటూ... ఆయనకు సిట్ నోటీసులిచ్చింది. ఈ మేరకు ఆయన సిట్ ఎదుట హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో తన ప్రమేయం లేదని... ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే.. తనను ఉరితీయాలని సిట్ అధికారులకు తేల్చిచెప్పినట్లు.... మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి తెలిపారు. సుమారు గంటపాటు తనను విచారించారన్న ఆయన... అధికారులు అడిగిన 30 ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు చెప్పారు. వివేకాను ఎవరు హత్య చేశారో అందరి మనస్సాక్షికి తెలుసని వ్యాఖ్యానించారు. కావాలనే తనను విచారణకు పిలిచారని వెల్లడించారు. హత్యకేసులో నిజనిజాలు వెల్లడి కావాలంటే... సీబీఐకి అప్పగించాలని కోరినట్లు తెలిపారు.