మంగంపేటలో ఉద్రిక్తత.. ఏపీఎండీసీ వాహనాలను అడ్డుకున్న గ్రామస్థులు - kadapa district latest news
11:17 August 21
డంపింగ్ యార్డును అడ్డుకున్న స్థానికులు
కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హరిజనవాడ, అరుంధతివాడ వద్ద ఏపీఎండీసీ మైనింగ్ వాహనాలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఏపీఎండీసీ మైనింగ్ వల్ల.. అనేక వ్యాధులకు గురై చాలా మంది మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆందోళన చేపట్టారు. అయితే నేడు మంగంపేట హరిజనవాడ సమీపంలో ఏపీఎండీసీ డంపింగ్ యార్డ్ కోసం రహదారి పనులు ప్రారంభించారు. ఈ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ఇక్కడి నుండి తరలించిన అనంతరం మాత్రమే డంపింగ్ పనులు చేసుకోవాలంటూ గ్రామస్థులు వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో గ్రామస్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సీపీఐ నాయకులు గ్రామస్థులతో కలిసి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు వారిని అక్కడ నుండి బలవంతంగా తరలించారు.
ఇదీ చదవండి: