ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలంటే భయమెందుకు: ఎమ్మెల్సీ బీటెక్ రవి

బలవంతపు ఏకగ్రీవాలు చేయటం దారుణమని.. తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆవేదన వ్యక్తం చేశారు. తెదేపా మద్దతుదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

tdp mlc btech ravi
ఎమ్మెల్సీ బీటెక్ రవి

By

Published : Feb 13, 2021, 12:22 PM IST

ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేసింటే.. ఎన్నికలంటే ఎందుకు భయమని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) ప్రశ్నించారు. పులివెందులలోని తెదేపా నాయకత్వ శిక్షణ శిబిరం రాయలసీమ డైరెక్టర్‌ రాంగోపాల్‌రెడ్డి నివాస ఆయన మాట్లాడారు. గ్రామ పంచాయతీల్లో పోటీ లేకుండా బలవంతంగా ఏకగ్రీవాలు చేయడం దారుణమన్నారు. తెదేపా మద్దతుదారులు నామినేషన్‌ వేసేందుకు ముందుకు వచ్చే వారిని .. అన్ని విధాలుగా భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో సంప్రదాయబద్ధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించామన్నారు. అదే సంప్రదాయం పులివెందుల నియోజకవర్గంలో ఎందుకు అమలుచేయడం లేదని అన్నారు. తెదేపా నాయకత్వ శిక్షణ శిబిరం రాయలసీమ డైరెక్టర్‌ రాంగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 2019 అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగాయని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details