భూగర్భజలాలు అడుగంటి పోయే విధంగా కడప జిల్లాలో ఇసుక తవ్వకాలను చేస్తున్నారని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఇసుక మొత్తాన్ని వైకాపా నాయకులు మింగేస్తున్నారని ఆయన విమర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా ఇచ్చామని పేర్కొన్నారు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణం ఇసుకను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. అన్న క్యాంటీన్ రద్దు చేయడంతో భవన నిర్మాణ కార్మికులు, వలస కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ శాఖలన్నింటిని భ్రష్టు పట్టించారని ఆయన ధ్వజమెత్తారు.