ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేయడాన్ని నిరసిస్తూ.. కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం ప్రకటన చేయాలంటూ డిమాండ్ చేశారు.
మాదిగ రిజర్వేషన్‌పై సీఎం నిర్ణయాన్ని నిరసిస్తూ ధర్నాలు - kadapa
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనపై కడప జిల్లా మైదుకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలు నిరసన చేపట్టారు.
ముఖ్యమంత్రి ప్రకటనపై నిరసనల వెల్లువ