కరోనా వైరస్‌తో కన్నవారిని కోల్పోయిన ఐదుగురు చిన్నారులను కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ దత్తత తీసుకున్నారు. ఆ పిల్లల విద్య, సంరక్షణ అంతా కూడా జిల్లా పోలీసు శాఖ చూసుకుంటుందని తెలిపారు. చిన్నారులు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి చేరుకునేలా వారిని సిద్ధం చేసేలా ప్రణాళిక చేసినట్లు చెప్పారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన పిల్లలు ఆవేదన, ఆందోళన చెందవద్దని.. వారిలో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
అనాథ చిన్నారుల దత్తత.. ఎస్పీ అన్బురాజన్‌కు ప్రశంసలు - ఎస్పీ అన్బురాజన్ తాజావార్తలు
కడప జిల్లావ్యాప్తంగా కరోనా వల్ల పలు కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కన్నవారిని కోల్పోయి అనాథలుగా మిగులుతున్న చిన్నారులూ ఉన్నారు. అలాంటి వారికోసం నేనున్నానంటూ ముందుకొచ్చారు జిల్లా ఎస్పీ అన్బురాజన్. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలను ఆయన దత్తత తీసుకున్నారు. దీంతో ప్రజలు ఎస్పీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఎస్పీ అన్బురాజన్.
పోలీసులతో పాటు, ప్రజల సంక్షేమానికి ఎస్పీ ఎంతో కృషి చేస్తున్నారని.. అన్బురాజన్ తమ జిల్లాలో పని చేయటం తమకెంతో సంతోషంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. పిల్లలను దత్తత తీసుకున్న ఎస్పీని ప్రశంసించారు.
ఇదీ చదవండి:global day of parents: ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం నాడే.. రోడ్డుపై ఊతకర్రతో పెద్దాయన!