క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి ఆరుగురు వ్యక్తులను కడప జిల్లా బ్రహ్మంగారిమఠంలో(బీ మఠం) పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 4 సెల్ఫోన్లు, రూ. 50వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు డీఎస్పీ బి.విజయ్‌కుమార్ వెల్లడించారు. బీమఠం మండలం అమంగంపల్లె క్రాస్‌రోడ్డు వద్ద బెట్టింగ్‌కు సంబంధించి.. లావాదేవీలు చేసుకుంటున్న క్రమంలో బీమఠంకు చెందిన ముగ్గురు, కాశినాయన మండలానికి చెందిన ఇద్దరు, బి.కోడూరు మండలానికి చెందిన ఒకరిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేశారు.
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురి అరెస్ట్ - క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి ఆరుగురు అరెస్టు
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన ఆరుగురు వ్యక్తులను కడప జిల్లా బి.మఠం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు సెల్ఫోన్లు, రూ.50వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
cricket betting