కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో గొరిగనూరు గ్రామ సమీపంలోని పెన్నానదిలో ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వీటితో పాటు ఒక జేసీబీని స్వాధీనం చేసుకుని, ఐదుగురు డ్రైవర్లను అరెస్టు చేసినట్లు సీఐ మధుసూదన్ రావు తెలిపారు.
జమ్మలమడుగులో ఇసుక ట్రాక్టర్లు పట్టివేత - sand tractors seized in jammalamadugu
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు.

Breaking News
అక్రమ ఇసుక రవాణా అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పనిచేస్తోందని... ఇందులో ఎక్సైజ్ శాఖ , పోలీస్ శాఖ అధికారులు కలిసి పని చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఇదీ చదవండి: సారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు