కడప జిల్లాలో ఆర్టీసీ యాజమాన్యంపై రోజురోజుకూ.. వ్యతిరేకత పెరుగుతోంది. సిబ్బందిని తగ్గించే ప్రయత్నం విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ...ఎంప్లాయిస్ యూనియన్ జమ్మలమడుగు డిపో వద్ద ధర్నా చేసింది. కార్మిక వ్యతిరేక విధానాలతో యాజమాన్యం ఏకపక్షనిర్ణయాలు తీసుకుంటోందని నేతలు ఆరోపించారు. అద్దె బస్సులు, అవుట్సోర్సింగ్ ప్రతిపాదనలు మానుకోవాలన్నారు. ప్రయాణికుల సంఖ్యకు తగినంతగా బస్సుల సంఖ్య పెంచాలని స్పష్టం చేశారు. సంస్థకు వచ్చే ఆదాయ లోటును ప్రభుత్వమే భరించాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె తప్పదని హెచ్చరించారు.
హక్కులు కాలరాస్తే ఊరుకోం: ఆర్టీసీ కార్మికులు
ఆర్టీసీ యాజమాన్యం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ..కార్మికుల హక్కులు కాలరాస్తే ఊరుకోబోమని ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. సిబ్బందిని కుదించే ప్రయత్నాన్ని ఆర్టీసీ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. కడప జిల్లా జమ్మలమడుగు డిపో వద్ద ధర్నా చేశారు. సంస్థకు వచ్చే లోటును ప్రభుత్వమే భరించాలని నినదించారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ధర్నా