కడప జిల్లా పెనగలూరు మండలం కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పెనగలూరు మండలం తిరునంపల్లి నుంచి వస్తున్న ద్విచక్రవాహనాన్ని పాఠశాల వ్యాన్ ఢీకొట్టింది.ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తుల్లో తిరునంపల్లికి చెందిన ప్రసాద్, నెల్లూరు జిల్లా రాజుపాలెంకు చెందిన పోలయ్య, గురువయ్య తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పాఠశాల వ్యాన్-బైక్ ఢీ... ముగ్గురికి తీవ్రగాయాలు
కడప జిల్లా కంబాలకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిందిం. ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న పాఠశాల వ్యాన్ ఢీకొనటంతో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులును చికిత్స కోసం తిరుపతికి తరలించారు.
కంబాలకుంట రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు