ఈ నెల 10న కడప జిల్లా రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడు పల్లికి చెందిన గుర్రం రామచంద్రయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం టైం స్కేల్ ఉద్యోగిగా ఇతను పని చేసేవాడు. మృతుడు రామచంద్రయ్య 25ఏళ్ల నుంచి ఎస్పీ కళాశాల హాస్టల్లో స్టోర్ ఇన్ఛార్జిగా పని చేస్తున్నాడు. ఆత్మహత్య అనంతరం అతని కుటుంబ సభ్యులు ఈనెల 11న రామచంద్రయ్య స్వగ్రామమైన అబ్బినాయుడు పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆత్మహత్యకు ముందు సెల్ఫీ
ఆత్మహత్యకు ముందు రామచంద్రరావు తనతో పాటు పనిచేసే కొందరు ఉద్యోగులు వేధింపులు తాళలేకే చనిపోతున్నట్లు వీడియో రికార్డు చేసి విద్యార్థులకు పంపాడు. అనంతరం మానవ హక్కుల సంఘానికి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. మృతుని భార్య విజయలక్ష్మి... స్పందన కార్యక్రమంలోనూ ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు చేపట్టిన తిరుపతి పోలీసులు... రామచంద్రయ్య మృతదేహాన్ని రైల్వే కోడూరు తహశీల్దారు సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్వీ యూనివర్శిటీ పరిధి సీఐ రవీంద్రనాథ్ తెలిపారు. తన తమ్ముడి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులను వెంటనే శిక్షించాలంటూ మృతుని అన్న పరమేశ్వర్ డిమాండ్ చేశాడు.
ఇవీ చూడండి