పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులను ఉత్తీర్ణులను చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి తులసి రెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఓ సమావేశంలో మాట్లాడిన ఆయన.. పదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే హాజరు ఆధారంగా పాస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పరీక్షల వాయిదాతో విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతులకు పంపించాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని అన్నారు.
'హాజరు ఆధారంగా పదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలి'
రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున ప్రస్తుతం పదో తరగతి పరీక్షలను రద్దు చేసి హాజరు ఆధారంగా విద్యార్థులందరినీ పాస్ చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి తులసి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'హాజరు ఆధారంగా పదో తరగతి విద్యార్థులను పాస్ చేయాలి'
TAGGED:
tenth class exams