ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 30, 2021, 5:34 PM IST

ETV Bharat / state

Red sandal: 13 మంది స్మగ్లర్లు అరెస్టు.. రూ. కోటి విలువైన దుంగలు స్వాధీనం

అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను కడప జిల్లా పోలీసులు అరెస్టు(red sandal Smuggling gang Arrest) చేశారు. నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలు, నాలుగు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

red sandal Smuggling gang Arrest
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్​

కడప జిల్లా నుంచి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న 13 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్ల(red sandal Smugglers arrest at kadapa)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖాజీపేట, సీకేదిన్నె, ఒంటిమిట్ట మండలాల పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల(red sandal Smugglers) నుంచి రూ. కోటి విలువ చేసే ఎర్రచందనం దుంగలు, నాలుగు బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్(kadapa sp Anburajan ) తెలిపారు.

పట్టుబడిన 13 మంది స్మగ్లర్ల(red sandal Smugglers)లో గతంలో అరెస్టైన వాళ్లు కొందరు ఉన్నారని... వారిపై మరోసారి పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. నలుగురు బడా స్మగ్లర్లపై 20కి పైగానే కేసులు నమోదు కావడంతో వారి ఆస్తులను జప్తు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో ఎక్కడైనా ఎర్రచందనం అక్రమంగా తరలిపోతున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ(kadapa sp Anburajan) విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి... :అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details