Smugglers: రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం పట్టివేత.. ఆరుగురు స్మగ్లర్ల అరెస్ట్ - కడపలో ఎర్రచందనం స్మగ్లర్ ఫాజిల్ షరీఫ్ సహా ఏడుగురు అరెస్టు
12:04 September 11
Cdp_Red sandal Smuglers arrest_Breaking
కడప జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను.. కడప జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న ఆరుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. రైల్వేకోడూరు, సుండుపల్లి ప్రాంతాల్లో.. ఎర్రచందనం దుంగలను వాహనాల్లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురు స్మగ్లర్లలో నలుగురు అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో వెలుగు మనెయ్య, కణతల ప్రసాద్, ఫాజిల్ షరీఫ్, సైఫుల్లా ఖాన్ అనే నలుగురు ప్రధాన స్మగ్లర్లతో పాటు.. పెయ్యల శేషాద్రినాయుడు, దొరస్వామినాయుడు అనే స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అంతర్జాతీయ స్మగ్లర్ పాజిల్ షరీఫ్ పై 14 ఎర్రచందనం కేసులు ఉన్నాయని, ఇతనిపై పీడీ యాక్టు కూడా నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి రూ.కోటి విలువ గల 44 ఎర్రచందనం దుంగలు, రెండు స్కార్పియో వాహనాలు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఇదీ చదవండి:
Minister Sucharita: రమ్య హత్య కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు: హోంమంత్రి సుచరిత